హిందీకి హిట్‌

16 Jul, 2020 02:15 IST|Sakshi
దిల్‌ రాజు, రాజ్‌కుమార్‌ రావ్‌, శైలేష్‌ కొలను

టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా ‘హిట్‌’ సినిమా చేరింది. విశ్వక్‌ సేన్, రుహానీ శర్మ జంటగా నూతన దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌’. హీరో నాని, ప్రశాంతి నిర్మించిన ఈ క్రైమ్, యాక్షన్‌ థ్రిల్లర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్‌’ రాజు హిందీలో రీమేక్‌ చేయనున్నారు. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘దిల్‌’ రాజు హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా  బాలీవుడ్‌ నిర్మాత కుల్‌దీప్‌ రాథోర్‌తో కలిసి ‘హిట్‌’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌ హీరోగా నటించనున్నారు. హిందీ రీమేక్‌ను కూడా శైలేష్‌ కొలను డైరెక్ట్‌ చేస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ సినిమా 2021లో సెట్స్‌పైకి వెళ్లనుంది. డైరెక్టర్‌ శైలేష్‌ కొలను మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్‌ రావ్, ‘దిల్‌’ రాజుగారితో కలిసి పని చేయనుండటం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. యూనివర్సల్‌ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచి, నేటివిటీకి తగినట్లు చిన్న చిన్న మార్పులు చేస్తా’’ అన్నారు. ‘‘ప్రస్తుతం మన సమాజానికి అవసరమైన కథాంశంతో తెరకెక్కిన ఎంగేజింగ్‌ మూవీ ‘హిట్‌’. ఓ నటుడిగా ఇలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ‘హిట్‌’ రీమేక్‌ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు రాజ్‌కుమార్‌ రావ్‌ .

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా