'రాజమౌళి అక్కడ పుట్టకపోవడం దురదృష్టం'

13 Jul, 2015 12:03 IST|Sakshi
'రాజమౌళి అక్కడ పుట్టకపోవడం దురదృష్టం'

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆకాశానికెత్తేశారు. ఇక ఏ సినిమా అయిన దీని తర్వాతే అని వ్యాఖ్యానించారు. హీరో కంటే కథే గొప్ప అని ఈ చిత్రం రుజువు చేసిందని, ఈ విషయాన్ని హాలీవుడ్ దశాబ్దాల క్రితమే గుర్తించిందని పేర్కొన్నారు. తామే గొప్పవాళ్లమని విర్రవీగుతున్న హీరోలకు 'బాహుబలి' మేలుకొలుపు అన్నారు.

సింహాలు, పులులు, ఏనుగులు, కొండచిలువలతో నిండివున్న ఇండస్ట్రీ జంగిల్ లోకి బాహుబలి డైనోసార్ వచ్చిందని... అంతకుముందున్న పాలన మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రభాస్ టెరిఫిక్ గా చేశాడని ప్రశంసించారు. దగ్గుబాటి రానా అయితే ఫిజికల్ గా, పెఫ్మార్ మెన్స్ పరంగా శిఖర స్థాయిని అందుకున్నాడని ఆకాశానికెత్తారు. రమ్యకృష్ణ చాలా బాగా చేసిందని మెచ్చుకున్నారు.

'బాహుబలి' తర్వాత వచ్చే పెద్ద హీరోల సినిమా 5డీలో చూడాల్సివుంటుందన్నారు. రాజమౌళి ఇక్కడకు పుట్టినందుకు తెలుగువారు గర్వపడక్కర్లేదని.. బాంబే లేదా లాస్ ఏంజెలెస్ లో పుట్టకపోవడం అతడి దురదృష్టమని ట్విటర్ లో పేర్కొన్నారు.