కల్కి షురూ

27 Aug, 2018 05:05 IST|Sakshi
రాజశేఖర్‌

పవర్‌ఫుల్‌ పాత్రలతో పాటు కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు కథానాయకుడు డా. రాజశేఖర్‌. గతేడాది ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన తర్వాతి చిత్రానికి కొంచెం గ్యాప్‌ తీసుకున్నారు. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో తర్వాతి చిత్రం ఉంటుందని రాజశేఖర్‌ ఓ హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

శివానీ శివాత్మిక మూవీస్‌ బ్యానర్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌ నిర్మాతలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్రబృందం ‘కల్కి’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించడంతో పాటు మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అంజలి కనిపించనున్నారనే వార్త షికారు చేస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు