అప్పుడే నాకు విషయమేంటో అర్థమైంది: రాకేష్‌ రోషన్‌

8 Nov, 2019 14:58 IST|Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు రాకేష్‌ రోషన్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయం విదితమే. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌ మహమ్మారితో  ఎలా పోరాడారో, దానిని ఎలా అధిగమించారో చెప్పుకొచ్చారు. ‘ఇదంతా ఎలా జరిగిందో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. నొప్పి లేదు, దురద లేదు.. ఇది చాలా చిన్న విషయం అనుకున్నాను. ఓ రోజు ముంబైలోని హిందూజ హాస్పిటల్‌కు నా స్నేహితుడిని కలవడానికి వెళ్లినప్పుడు.. తనతో మాట్లాడుకుంటూ అక్కడి ఆవరణంలో నడుస్తున్నాను. ఆ సమయంలో అక్కడ ఈఎన్‌టీ సర్జన్‌ బోర్డు చూసి డాక్టర్‌ క్యాబిన్‌కు వెళ్లాను. ఆ డాక్టర్‌ నన్ను పరీక్షించి ‘బయాప్సీ’ పరీక్ష చేయించుకొమని సలహా ఇచ్చారు. డాక్టర్‌ ఎందుకు ఆ పరీక్ష చేయించుకొమ్మన్నారో నాకు తెలియదు కానీ.. నేను కాన్సర్‌ బారిన పడిన సంగతి నాకు కొంత అర్ధమైంది. ఆ తర్వాత నేను హృతిక్‌ రోషన్‌(నా తనయుడు) వద్ద ఉన్న సమయంలో(15 డిసెంబర్‌2018 ) రోజున పరీక్షలో బయాప్పీ పాజిటివ్‌ వచ్చిందని ఫోన్‌ వచ్చింది’ అని పేర్కొన్నారు.

I have always been a student of Life. The burning desire in me to learn, is as blazing as a toddler. But before I could understand and interpret my many life lessons, it was my Father who taught me. Thank you Papa, for teaching me things that no education institution, no acting classes, no book could. for making me understand and not only see, for pushing me to think before I act. You make me be a better human, father, son, actor and friend. Thank you for being an example, it is upto you I look, when my children look for their dad. Happy Teacher's day

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

అలాగే తన కుటుంబం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని ఈ విషయం వారిని కదిలించలేదని రాకేష్‌ రోషన్‌ పేర్కొన్నారు. కాగా ‘కాన్సర్‌ చికత్సలో భాగంగా నా నాలుకను కత్తిరించాల్సి ఉంటుందని డాక్టర్‌ చెప్పినప్పుడు నేను కాస్త భయపడి  మొదట నిరాకరించాను. ఆ తర్వాత కాన్సర్‌ కణాలు ఉన్న నా నాలుక భాగాన్ని కత్తిరించారు. ఆ తర్వాత మూడు నెలల పాటు నీళ్లు, టీ, కాఫీలాంటివి తాగలేక పోయాను. కొన్నిసార్లు నాలుకలోని రుచి కణాలు కూడా సరిగా పని చేయక వివిధ రుచులను ఇచ్చేవి. ఈ మూడు నెలల్లో నేను దాదాపు 10 కిలోల బరువు తగ్గాను, అయితే మళ్లీ 3 కేజీ బరువు పెరిగాను. ఇప్పుడు రోజు 90 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నా. పూర్తి ఆరోగ్యవంతంగా మారటానికి మరో ఆరు నెలల సమయం పడుతుందేమో’ అంటూ చెప్పుకొచ్చారు.
 

#personalised napkins too#love from your children is irreplaceable #glimpse of my surprise#liveyourbestlife #

A post shared by Pinkie Roshan (@pinkieroshan) on

>
మరిన్ని వార్తలు