మోక్షజ్ఞకు జోడిగా రకుల్‌..?

19 Jul, 2018 08:49 IST|Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. ఇప్పటికే లెజండరి యాక్ట్రెస్‌ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే కోవలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్‌టీఆర్‌’. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్‌టీఆర్‌’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పలు ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక పూర్తై శర వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది ఈ చిత్రం. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రకుల్‌ ప్రీత్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారంట.

వివరాల ప్రకారం.. ఈ చిత్రంలో రకుల్‌ ఎన్టీఆర్‌కు పాలు అమ్మే మహిళ పాత్రలో, బాలాయ్య తనయుడు మోక్షజ్ఞతో జత కట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్న సంగతి తెలిసిందే. యువ ఎన్టీఆర్‌కు జోడిగా రకుల్‌ జతకట్టనున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు చిత్రంలో కీలకం కానున్నయని టాక్‌. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో రకుల్‌ని అలనాటి అందాల తార శ్రీదేవి పాత్ర కోసం తీసుకోనున్నట్లు సమాచారం.

మరి ఇంతకు రకుల్‌ ఎవరి పాత్రలో కనిపిస్తుందనే సస్పెన్స్‌ వీడాలంటే.. రకుల్‌ లేదా చిత్ర యూనిట్‌ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ అభిమానులు ఎదురు చూడక తప్పదు. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లో పాల్గొనడం కోసం విద్యా రామోజీ ఫిలీం సిటిలో ఎంటర్‌ అయ్యారు.

జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం అండ్‌ విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు