హీరోగా ఎంట్రీ ఇస్తున్న రకుల్ సోదరుడు

23 Feb, 2019 15:48 IST|Sakshi

ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామనే. అయితే ఎక్కువగా హీరోల సోదరులు, కుమారులు వారసులుగా ఎంట్రీ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్‌ కూడా తన వారసుణ్ని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్‌ సింగ్ తన సోదరుడు అమన్‌ను హీరోగా లాంచ్‌ చేస్తున్నారు.

రాజానే ఫిలిం కార్పోరేషన్‌ నిర్మాణంలో దాసరి లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో అమన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే రాక్‌ అండ్‌ రోల్‌ అనే షార్ట్ ఫిలింలో నటించిన అమన్‌, హీరోగా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఆదివారం ఉదయం పది గంటలకు అమన్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంచనంగా ప్రారంభమవుతుంది.

మరిన్ని వార్తలు