కొట్టేద్దామా పోస్టర్‌!

27 Nov, 2017 01:17 IST|Sakshi

ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి... ఇదేదో వేలం పాటలా ఉందే! ఇంతకీ, వేలం పాట దేని కోసం? అనేగా మీ డౌట్‌. ఇక్కడ వేలం పాట లేదు... మీరు పోటీలో పాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు విషయం ఏంటంటే... రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లది హిట్‌ కాంబినేషన్‌. ‘బ్రూస్‌లీ, ధృవ’ సినిమాలతో హిట్‌ పెయిర్‌ అని పేరు తెచ్చుకున్నారు. ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. అందులో చరణ్‌ సరసన రకుల్‌ నటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. చిత్రవర్గాలు కూడా ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పైగా, ‘సరైనోడు, జయ జానకి నాయక’ చిత్రాల్లో రకుల్‌ ప్రతిభ, అంకితభావం చూసిన బోయపాటి తన తర్వాతి సినిమాకి రకుల్‌ని తీసుకోనున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి.

దీనిబట్టి చూసినా చరణ్‌ సరసన రకుల్‌కి మరో ఛాన్స్‌ ఫిక్స్‌ అయినట్లే అని ఊహించవచ్చు. ఆ సంగతలా ఉంచితే ‘బ్రూస్‌లీ’లో ‘మెగా మెగా మెగా మీటర్‌.. కొట్టేద్దామా పోస్టర్‌’ అని రామ్‌చరణ్, రకుల్‌ పాడతారు. మరోసారి నటిస్తే.. మళ్లీ పోస్టర్‌ కొట్టేస్తారు. అదేనండీ.. కొత్త సినిమాకి పోస్టర్లు వేస్తారు కదా! ప్రస్తుతం సుకుమార్‌ ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, అది పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు