మళ్లీ జోడీ

23 Dec, 2019 00:49 IST|Sakshi

ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రం ‘దేదే ప్యార్‌ దే’ విజయం రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు బాలీవుడ్‌లో అవకాశాలను తెచ్చిపెడుతోంది. ఇందులో అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటించారు. మళ్లీ అజయ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. ‘దే దే ప్యార్‌ దే’ హిట్‌తో హిట్‌ జోడీ అనిపించుకున్న అజయ్, రకుల్‌ మళ్లీ ఈ చిత్రంతో హిట్‌ అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ‘ధమాల్‌’ ఫ్రాంచైజీ డైరెక్టర్‌ ఇంద్రకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఇందులో యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా కూడా ఓ హీరోగా నటిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ మార్చిలో ప్రారంభించనున్నారట. యాక్షన్‌–కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట.  మరోవైపు హిందీలో అర్జున్‌ కపూర్, జాన్‌ అబ్రహాం చిత్రాల్లో కథానాయికగా నటించడంతో పాటు కమల్‌హాసన్‌ ’ఇండియన్‌ 2’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తూ రకుల్‌ ప్రస్తుతం ఫుల్‌ బిజీ.

మరిన్ని వార్తలు