మల్టీస్టారర్‌లో రకుల్‌..?

19 May, 2018 14:12 IST|Sakshi

గత ఏడాది స్పైడర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. టాలీవుడ్‌ లో కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే తమిళ, హిందీ సినిమాలను అంగీకరించి టాలీవుడ్‌ కు దూరమైంది. ప్రస్తుతం రకుల్‌ మూడు తమిళ సినిమాలతో పాటు ఒక హిందీలో నటిస్తున్నారు.

వరుసగా తమిళ, హిందీ సినిమాలే అంగీకరిస్తుండటంతో ఇక టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్టే అని భావించారు ఫ్యాన్స్‌. అయితే తాజాగా ఈ భామ ఓ తెలుగు సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో చైతూకు జోడిగా రకుల్‌ను ఫైనల్‌ చేశారు.

నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరోసారి ఇదే కాంబినేషన్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. కోన వెంకట్‌, సురేష్‌ బాబు, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు