గెట్‌ సెట్‌ గో

7 Jun, 2018 00:26 IST|Sakshi
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ఇక్కడున్న ఫొటోలు చూశారుగా.. కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంత శ్రద్ధగా మేకప్‌ చేసుకుంటున్నారో! రకుల్‌ మేకప్‌ ప్రిపరేషన్‌ ఎందుకో స్పెషల్‌గా చెప్పాలా. సినిమా కోసమే. కార్తీ హీరోగా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదారాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌ కోసమే రకుల్‌ ఇలా రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు ‘దేవ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని కోలీవుడ్‌ కహానీ.

మరిన్ని వార్తలు