అందరినీ సంతృప్తి పరచలేను!

27 Jun, 2019 08:19 IST|Sakshi

సినిమా: అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అంటోంది. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్నా, ఇటీవల ఈ జాణకు హిట్స్‌ కరువయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో సూర్యతో జతకట్టిన ఎన్‌జీకే చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం రకుల్‌కు పూర్తిగా నిరాశనే మిగిల్సింది. కోలీవుడ్‌లో దేవ్‌ చిత్రం తరువాత ఈమె చవిచూసిన రెండవ అపజయం ఎన్‌జీకే. ఇక తెలుగులోనూ అర్జెంట్‌గా ఆ బ్యూటీకి ఒక హిట్‌ కావాలి. అయితే ప్రస్తుతం నాగార్జునతో మన్మథుడు–2 చిత్రంలో నటిస్తోంది. ఈమెకు ఆశాదీపం ఆ చిత్రమే.  ఇకపోతే కోలీవుడ్‌లో విజయ్‌ సరసన నటించి అవకాశం ఎదురుచూస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని అవకాశాల కోసం రకుల్‌ప్రీత్‌సింగ్‌ తన ప్రయత్నాలు తాను చేసుకుంటోంది.

అందులో భాగంగా గ్లామరస్‌ ఫొటోలను సోషల్‌ మీడియాకు విడుదల చేస్తూ చర్చల్లో నానుతోంది. తన అవకాశాల మాటెలా ఉన్నా, నెటిజన్లు మాత్రం ఈ అమ్మడిని ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పాలి.  కొందరు అభిమానులను ఆ ఫొటోలు ఎంజాయ్‌మెంట్‌ను ఇస్తున్నా, మరి కొందరి విమర్శలను రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఎదుర్కోకతప్పడం లేదు. అయితే విమర్శలు ఎప్పుడూ రుచించవు. వాటి గురించి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా విరుచుకుపడుతోంది. ఈ అమ్మడు ఏం అంటుందో చూద్దాం. సామాజిక మాధ్యమాల్లోని కొందరు పనీ పాటా లేని వారు ఉంటారని అంది. అలాంటి వారికి ఇంకొకరిని విమర్శించడమే పని అని విరుచుకు పడింది. అయినా తన తల్లిదండ్రులు, స్నేహితుల అభిప్రాయాలనే తాను గౌరవిస్తానని ఇతరుల గురించి పట్టించుకోవలసిని అవసరం తనకు లేదని అంది. అంతే కాకుండా అందరినీ సంతృప్తి పరచడం తన వల్ల కాదనీ రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఉత్తరాది భామ కథా ఈ అమ్మడికి ఆ పాటి టెక్‌ ఉండటం సహజమే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా