సినిమా కోసమే కాల్చాను!

7 Aug, 2019 03:43 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీ మారుతోంది. విభిన్నమైన సినిమాలు వస్తున్నాయి. సినిమాను సినిమాలా చూసే ఆలోచనాధోరణి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘మన్మథుడు 2’ సినిమాలో సిగరెట్‌ కాల్చింది నేను కాదు.. అవంతిక (ఈ సినిమాలో రకుల్‌ పాత్ర పేరు). సిగరెట్‌ కాల్చడం అవంతికకు ఉన్న అలవాటు. సినిమాలో కూడా ఇవి రెండు మూడు షాట్స్‌ మాత్రమే ఉంటాయి. నా నిజజీవితంలో నేను సిగరెట్‌ కాల్చను. అయినా హీరోలు కాల్చితే ఏ ప్రాబ్లమూ ఉండదు.

అదే సినిమాలో హీరోయిన్‌ సిగరెట్‌ కాల్చితే అదో పెద్ద టాపిక్‌. సినిమాలో ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే క్యాషన్‌ కూడా వేస్తుంటాం కదా’’ అన్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. అక్కినేని నాగార్జున, పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్‌ చెప్పిన విశేషాలు.

► అల్లరి, చిలిపితనం, కోపం, బాధ ఇలా అన్నిరకాల భావోద్వేగాలతో నేను చేసిన అవంతిక పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర. అవంతికకు కొన్ని పంచ్‌ డైలాగ్స్‌ కూడా ఉన్నాయి. ఆడియన్స్‌కు తను తప్పకుండా నచ్చుతుంది.

► నాగార్జున సార్‌ మంచి కో–స్టార్‌. హీరోయిజమ్‌ అని కాకుండా కథలోని హీరో పాత్రకు తగ్గట్లు నటించారు. ఓ పాట చిత్రీకరణ కోసం మేం స్విట్జర్లాండ్‌ వెళ్లినప్పుడు నాకు ఎలాంటి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ వద్దు.. యూనిట్‌ మెంబర్స్‌కు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో నాకూ అలాగే ఏర్పాటు చేయండి అన్నారు. అందుకే ఆయన కింగ్‌ అనిపించింది. లక్ష్మీగారు, ‘వెన్నెల’ కిశోర్‌ ఇలా అందరి పాత్రలు కథలో భాగంగానే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాయి. హ్యాపీ హ్యాపీగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేశాను. అప్పుడే షూటింగ్‌ అయిపోయిందా? అనిపించింది.

► రాహుల్‌ రవీంద్రన్‌ నాకు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా నుంచే తెలుసు. చాలా ప్రతిభ ఉన్న రైటర్‌. యాక్టర్‌ కూడా. రాహుల్‌ను నేను బడే భయ్యా అని పిలుస్తాను. సెట్‌లో ఎప్పుడూ ఒక పాజిటివ్‌ వైబ్‌తోనే ఉంటాడు. బౌండ్‌ స్క్రిప్ట్‌ ముందే ఇవ్వడం వల్ల ఏ టెన్షన్‌ లేకుండా షూటింగ్‌ చేయగలిగాను. రాహుల్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిలసౌ’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూశా. కానీ ‘చిలసౌ’ లోని అంజలి పాత్రకు ‘మన్మథుడు 2’ లోని అవంతిక పాత్రకు పోలిక పెట్టలేం.

► నేను హిందీలో చేసిన ‘దేదే ప్యార్‌ దే’ సినిమాకు, ‘మన్మథుడు 2’ చిత్రకథకు సంబంధం లేదు. ఉన్న కామన్‌ పాయింట్‌ ఒకటే... అతని కన్నా కాస్త తక్కువ వయసున్న అమ్మాయి హీరో లైఫ్‌లోకి వస్తుంది. ‘దేదే ప్యార్‌ దే’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారన్న వార్త నేను విన్నాను. అయితే రీమేక్‌ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అయినా చేసిన పాత్రనే మళ్లీ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. సేమ్‌ రోల్‌ అయితే ఆడియన్స్‌ కూడా బోర్‌ ఫీల్‌ అవుతారు. నాకు పెద్ద కిక్‌ ఉండదు.

► సినిమాలో అవంతిక పాత్రకు వివాహం జరుగుతుందా? లేక లివింగ్‌ రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్‌ను ప్రస్తావించామా? అనే అంశాలను ఇప్పుడు చెప్పలేను. సినిమా చూసి ఆడియన్స్‌ తెలుసుకోవాల్సిందే. ఇక లివింగ్‌ రిలేషన్‌షిప్‌ గురించి నా అభిప్రాయం చెప్పడానికి నేను ఏ రిలేషన్‌లోనూ లేను (నవ్వుతూ). పెళ్లి విధానంపై నాకు మంచి నమ్మకం ఉంది.

► నాగార్జునగారి ‘మన్మథుడు’ (2002) సినిమా చూశాను. ‘మన్మథుడు 2’ ఓ ఫ్రెంచ్‌ సినిమాకు తెలుగు రీమేక్‌. అయితే ఆ ఫ్రెంచ్‌ సినిమాను నేను చూడలేదు. ఒకవేళ చూస్తే మనకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో ఆ సినిమాలోని హీరోయిన్‌లా చేయడానికి ట్రై చేస్తానేమో అని డౌట్‌.

► ‘దే దే ప్యార్‌ దే’లో అజయ్‌ దేవగన్, ‘మన్మథుడు 2’లో నాగార్జునగారు ఇలా సీనియర్‌ యాక్టర్స్‌తోనే నేను సినిమాలు చేస్తున్నాను కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నితిన్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో క్రిమినల్‌ లాయర్‌గా చేస్తున్నాను. ‘ఇండియన్‌ 2’ లో సిద్ధార్థ్‌ సరసన నటిస్తున్నాను. సినిమా కథ, అందులోని నా పాత్రే ఇంపార్టెంట్‌ నాకు. ఏవేవో ఆలోచించి మంచి పాత్రలను వదులుకోవాలనుకోను. హిందీలో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్‌ చేస్తాను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు