కాబోయే భర్త ఎలా ఉండాలంటే? 

12 Jul, 2020 13:49 IST|Sakshi

చెన్నై: తనకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే అంటూ చెప్పుకొచ్చింది నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇంతకుముందు తెలుగులో క్రేజీ కథానాయికగా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాలపై ఎక్కువగా సారిస్తోంది. అలా తమిళంలో 2, హిందీలో మూడు చిత్రాలతో బిజీగా ఉంది. సాధారణంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆమె అభిమానులు గ్లామర్‌ స్టార్‌ గానే చూడాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆమె అందాల ఆరబోతలో విజృంభిస్తోంది. తరచూ అలాంటి ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తోంది. కాగా ప్రస్తుత లాక్‌డౌన్‌ కాలంలో తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను ఇటీవల సామాజిక మాద్యమాలకు విడుదల చేసింది. అదే మాదిరిగా ఇతర నటీమణుల మాదిరిగానే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా తన వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ కాలక్షేపం చేసింది.
(చదవండి: న‌టి సెక్యూరిటీ గార్డుకు క‌రోనా)

అలా ఒక అభిమాని ఏలాంటి అర్హతలు ఉన్న వ్యక్తి  మీకు భర్తగా రావాలని అని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే తనకు ప్రేమ అన్నా, పెళ్లి అన్నా చాలా గౌరవం అని ఆమె పేర్కొంది. ఇక తనకు ఎలాంటి భర్త కావాలన్న విషయానికి వస్తే ఆ విషయంగా తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. ముఖ్యంగా చాలా పొడవైన వాడుగా ఉండాలని చెప్పింది. అది ఎంతగా అంటే తాను హైహిల్స్‌ వేసుకున్నా తలెత్తే చూసేలా నేను చేసుకోబోయే అతను  ఉండాలని ఆమె అంది. అదేవిధంగా మంచి బుద్ధి, తెలివికలవాడై ఉండాలని చెప్పింది. మరి అలాంటి వాడు ఇప్పటికీ తారస పడలేదా అనే ప్రశ్నకు ఇంకా లేదని రకుల్‌ చెప్పింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌ –2 చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఆశగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. 
(చదవండి: హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్యూట్ ఫోటోలు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు