నోరూరిస్తున్న ర‌కుల్ కుకీస్ రెసిపీ..

7 May, 2020 08:29 IST|Sakshi

ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సెల‌బ్ర‌టీల‌కు లాక్‌డౌన్ కార‌ణంగా బెల‌డంత స‌మ‌యం మిగిలింది. దీంతో త‌మ‌  విలువైన స‌మ‌యాన్ని కుటుంబస‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. ఈ గ్యాప్‌లో కొత్త వంట ప్ర‌యోగాలు చేస్తూ అభిమానుల‌కు నోరూరిస్తున్నారు. ఎప్పుడూ వ‌ర్క‌వుట్ల‌తో బిజీగా ఉండే ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా కిచెన్‌లో సందడి చేసింది. హెల్తీ బ‌నానా చాక్లెట్ ఓట్‌మీల్ కుకీస్ త‌యారు చేశారు. దీనికి సంబంధించిన రెసిపీ వీడియోను షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. మ‌రి ర‌కుల్ చేసిన రెసిపీకి కావ‌ల్సిన ప‌దార్థాలు
1. రెండు పండిన అర‌టి పండ్లు
2. 50 గ్రాముల ఓట్‌మీల్‌
3. 2 స్ఫూన్ల చాకో పౌడ‌ర్‌
4. మ్యూసిల్ (ఆప్ష‌న‌ల్ )
5. తురిమిన చాక్లెట్‌
చాలా త‌క్కువ ఇంగ్రీడియంట్స్‌తో హెల్తీ బ‌నానా చాక్లెట్ ఓట్‌మీల్ కుకీస్.. చెప్తుంటేనే నోరూరుతుంది క‌దా మ‌రి త‌యారీ విధానం ఎలాగో తెలియాలంటే వీడియో చూసేయండి మ‌రి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు