-

యూట్యూబ్‌లో వంటలు ప్రారంభించిన రకుల్‌..

8 Apr, 2020 12:13 IST|Sakshi

సినిమాలతోపాటు సోషల్‌ మీడియాలోనూ ఆక్టివ్‌గా ఉంటారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. యోగా, వర్కౌట్‌లకు సంబంధించిన విషయాలనే కాకుండా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే రకుల్‌ కొత్తగా యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఇందులో వంటలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా(మంగళవారం) ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అలాగే తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కరోనాపై పోరాటానికి పీఎం కేర్‌ ఫండ్స్‌కు అందించనున్నట్లు ఆమె తెలిపారు. కాగా సోమవారమే హీరోయిన్‌ హన్సిక కూడా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. (‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాద్‌షా’ )

ఈ మేరకు రకుల్‌ ‘ప్రస్తుతం నాకు  చాలా సమయం ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాలని అనుకున్నాను, దీనిలో అన్ని సరదా విషయాలను మీతో పంచుకుంటాను. దీని ద్వారా వచ్చే ఆదాయం పీఎం కేర్‌ ఫండ్‌కు వెళుతుంది. ప్రతి ఒక్కరం ఆనందాన్ని పంచుదాం. మార్పు కోసం ఇప్పుడే ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్‌ చేయండి’ అని కోరారు. ఇక తొలి వీడియోగా చాకొలెట్‌ పాన్‌కేక్‌ను ఎలా తయారు చేయాలో వీడియో చేసి అప్‌లోడ్‌ చేశారు. కాగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 200 కుటుంబాలకు రకుల్‌ ఆహారం అందజేస్తున్న విషయం తెలిసిందే. గుర్గావ్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న పేదవారికి ఈ సహాయం చేస్తున్నారు.  రకుల్‌ ప్రస్తుతం ఇండియన్‌-2లో నటిస్తున్నారు. (కరోనాతో 14 నెలల చిన్నారి మృతి )

మీ అమ్మ అలానే చేసిందా..రకుల్‌ ఫైర్‌

A lot of time on hand so I thought of launching my YouTube channel which will have all things fun !! The revenue generated will go to @pmoindia fund ! Let’s spread joy and happiness in whatever way we can. Subscribe now to make a difference !! 😀😀🙏🏻 anddddd because it’s world health day we kickstart with... umm check out the video 😝 link in bio 😊

A post shared by Rakul Singh (@rakulpreet) on

మరిన్ని వార్తలు