దే దే ప్యార్‌ దే!

8 May, 2018 00:40 IST|Sakshi
రకుల్‌ ప్రీత్‌సింగ్

పెళ్లైన వ్యక్తి జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. అతని మనసులో మళ్లీ ప్రేమ చిగురించింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ప్రేమ గురించి తన భార్యకు తెలియకుండా ప్లానుల మీద ప్లానులు మొదలుపెట్టాడు. ఫైనల్‌గా ఓ రోజు ఏం జరిగిందంటే.. ఇప్పుడే తెలుసుకుంటే కిక్‌ ఏముంది? థియేటర్స్‌లో చూస్తేనేగా అసలు కిక్‌ వస్తుంది. అజయ్‌ దేవగన్, టబు, రకుల్‌ ప్రీత్‌సింగ్, జిమ్మి షెర్గిల్‌ ముఖ్య పాత్రలుగా అకివ్‌ అలీ దర్శకత్వంలో హిందీలో ఓ చిత్రం రూపొందుతుంది. ఇందులో అజయ్‌ భార్యగా టబు, ఆయన ప్రేయసి పాత్రలో రకుల్‌ కనిపిస్తారని టాక్‌.

మ్యారేజ్‌ అండ్‌ మోడ్రన్‌ డేస్‌ రిలేషన్‌షిప్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు ‘దే దే ప్యార్‌ దే’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అంటే.. ఇవ్వు.. ఇవ్వు.. ప్రేమ ఇవ్వు అని అర్థం. ఒక ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. ‘దే దే ప్యార్‌ దే...’ అనే సాంగ్‌ 1948లో అమితాబ్‌ బచ్చన్, జయప్రద నటించిన ‘షరాబి’ చిత్రంలో ఉంది. మరి.. అజయ్‌ అండ్‌ టీమ్‌ ఇదే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తారా? లేక మరేదైనా టైటిల్‌ను కన్ఫార్మ్‌ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నైట్‌ సీన్స్‌ని ముంబైలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు