బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నా : రకుల్‌

18 Aug, 2018 10:00 IST|Sakshi

సినిమా వాళ్లు ఇంటిదగ్గర ఉంటడం అరుదేనని చెప్పకతప్పదు. అదీ అగ్రహీరోయిన్లు అయితే ఒక్కోసారి రెండు మూడు నెలలపాటు ఇంటి ముఖం చూసే పరిస్థితి ఉండదు. నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఇదే పరిస్థితి అట. ఈ అమ్మడికి టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గుముఖం పట్టినా కోలీవుడ్‌లో సూర్యకు జంటగా ఎన్‌జీకే, కార్తీతో దేవ్, శివకార్తీకేయన్‌ సరసన ఒక చిత్రం అంటూ బిజీగా ఉంది. ఒక హింది చిత్రంలోనూ నటిస్తోంది. దీంతో ఇంటి ముఖం చూసి చాలా కాలం అయ్యిందని బెంగ పట్టుకుంది. మనసు అటు వైపు లాగుతోంది అంటోందీ బ్యూటీ. దీని గురించి రకుల్‌ ఏమంటుందో చూద్దాం.

నాకు నటన అంటే చాలా ఆసక్తి. ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం నటిస్తున్న  చిత్రాలను పూర్తి చేసి కొత్త చిత్రాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతకుముందు నటన నుంచి కాస్త విరామాన్ని కోరుకుంటున్నాను. అనంతరం మళ్లీ నూతనోత్సాహంతో నటించడానికి రెడీ అవుతాను. గత జూలై నెల పూర్తిగా లండన్‌లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ తరువాత తమిళ చిత్రం కోసం ఉక్రెయిన్‌ వెళ్లాను. అక్కడు షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చాను.

ఆ తరువాత చెన్నై పరసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌లో పాల్గొంటున్నాను. ఇలా బిజీగా నటిస్తుండడంతో  ఇంటిపై బెంగ పట్టుకుంది. ఇంటి భోజనం తిని చాలా కాలం అయ్యింది. మానసికంగానూ కాస్త విశ్రాంతి అవసరం. అందుకే ప్రస్తుతం నటిస్తున్న చిత్ర షూటింగ్‌ ఒక షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పెట్టుకోమని ఆ చిత్ర దర్శక నిర్మాతలను అడుగుతున్నాను అని రకుల్‌ అంటోంది. తాను హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెబుతోందన్నమాట.    

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా