నువ్వు నీతులు చెప్పకు..!

10 Jul, 2019 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవంతిక పాత్రలో సిగరెట్‌ తాగింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అయితే విమర్శలపాలవుతోంది మాత్రం గాయని చిన్మయి శ్రీపాద. కొన్ని రోజులుగా వేధింపులపై పోరాడుతున్న చిన్మయి.. మన్మథుడు 2 సినిమాలోని రకుల్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను షేర్‌ చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సిగరెట్‌ సీన్‌కు అర్థం ఏంటంటూ ఆమెను పలువురు ప్రశ్నిస్తున్నారు. మీ భర్త చేస్తే ఒప్పు, మిగతావారు చేస్తే మాత్రం తప్పా? అంటూ నిలదీస్తున్నారు. ఈ విమర్శలకు కారణం లేకపోలేదు. మొన్నటివరకు కబీర్‌ సింగ్‌ చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగను ‘సినిమా తీసే పద్దతి ఇదేనా? ఆడవారిని అలా చూపించొచ్చా’ అంటూ దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ఇప్పుడేమో చిన్మయి భర్త రాహుల్‌ రవీంద్రన్‌ తన సినిమాలో హీరోయిన్‌తో సిగరెట్‌ తాగించాడు. అంతేకాక బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా చెప్పించడంతో నెటిజన్లు చిన్మయికి చుక్కలు చూపిస్తున్నారు. ఇల్లు చక్కబెట్టుకోలేదు కానీ, అందరికీ నీతులు చెబుతోంది అంటూ చిన్మయిపై విరుచుకుపడుతున్నారు.

చి.ల.సౌ. చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన రాహుల్‌ రవీంద్రన్‌ మన్మథుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అవంతిక పాత్రలో రకుల్‌ ప్రీత్‌ నటిస్తోంది. జూలై 9న  విడుదలైన టీజర్‌లో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ గోడకు ఏటవాలుగా నిలబడి గుప్పుగుప్పుమంటూ సిగరెట్‌ పొగను గాల్లోకి వదలడం, హీరో నాగార్జునతో ఆమె డైలాగులు చర్చకు దారితీశాయి. కొందరేమో టీజర్‌ అద్భుతంగా వచ్చిందంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరేమో రకుల్‌ సిగరెట్‌ తాగే సీన్‌ను తప్పు పడుతున్నారు. ఎటొచ్చీ రాహుల్‌, చిన్మయిలకు మాత్రం ట్రోల్స్‌ తప్పట్లేదు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు