‘ఇస్మార్ట్‌ శంకర్‌’ భలే ఉన్నాడే!

3 Jan, 2019 16:53 IST|Sakshi

ఫ్లాపుల్లో ఉన్న రామ్‌, పూరి కాంబినేషన్‌లో ఓ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘హలో గురు ప్రేమ కోసమే’ అంటూ రామ్‌ రీసెంట్‌గా పలకరించగా.. ‘మెహబూబా’ అంటూ పూరి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమా ఫలితాలు.. వీరికి నిరాశనే మిగిల్చాయి. అయితే ఈ సారి మాత్రం హిట్‌ కొట్టడం పక్కా అంటూ రెడీ అయ్యారు. 

ఇస్మార్ట్‌ శంకర్‌.. అంటూ తెలంగాణ యాస టైటిల్‌తో రచ్చ చేయడానికి రెడీ అయ్యారు. రామ్‌ డిఫరెంట్‌ లుక్‌లో ఉన్న పోస్టర్స్‌ కొత్తగా ఉన్నాయి. ఈ సినిమాతో వీరిద్దరు హిట్‌ ట్రాక్‌ పట్టడం ఖాయమని ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీ రామ్‌కు 17వ చిత్రం కాగా, పూరికి 35వ చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. 

మరిన్ని వార్తలు