హైదరాబాద్‌లో చెర్రీ-బోయపాటి షూటింగ్‌!

14 Aug, 2018 10:39 IST|Sakshi

‘రంగస్థలం’లో చిట్టిబాబుగా మంచి నటన కనబర్చి కెరీర్‌లో భారీ హిట్‌ కొట్టాడు రామ్‌చరణ్‌. మాస్‌ ప్రేక్షకులను అలరించేలా సినిమాలను తీసే దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రయూనిట్‌. 

తాజాగా మరో షెడ్యుల్‌ను హైదరాబాద్‌లో షూట్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఆగస్టు 15నుంచి హైదరాబాద్‌లో ఓ షెడ్యుల్‌ను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత ప్రకటించాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్‌ ఒబేరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు