లాక్‌డౌన్‌ చెఫ్‌లు

17 Apr, 2020 00:43 IST|Sakshi
రామ్‌చరణ్, మంచు విష్ణు

లాక్‌డౌన్‌ సమయాల్లో ఇంట్లోనే ఉండిపోవడంతో ఇంటి పనుల్లో తమ వంతు సహాయం చేస్తున్నారు స్టార్స్‌. తమ ప్రతిభను బయటకు తీసుకొస్తున్నారు. ఈ మధ్యే రామ్‌చరణ్, మంచు విష్ణు చెఫ్‌లుగా మారారు. తన మిసెస్‌ కోసం రామ్‌చరణ్‌ డిన్నర్‌ తయారు చేస్తే, ఫ్యామిలీ కోసం సరదాగా కోకోనట్‌ చికెన్‌ తయారు చేశారు మంచు విష్ణు.
 
‘‘భర్తలందరూ వినండి, మిస్టర్‌ సి. (చరణ్‌ని ఉపాసన అలానే పిలుస్తారు) నాకోసం డిన్నర్‌ తయారు చేశారు. డిన్నర్‌ పూర్తయిన తర్వాత అవి శుభ్రం కూడా చేశారు. ఇలాంటి చిన్న చిన్న పనులే అతన్ని నా హీరోని చేస్తాయి’’ అని ట్వీట్‌ చేయడంతో పాటు చరణ్‌ వంట చేస్తున్న వీడియోను ఉపాసన షేర్‌ చేశారు.

లాక్‌డౌన్‌ పూర్తయ్యేలోగా వంటలో మాస్టర్‌ అవుతానేమో? అంటున్నారు విష్ణు. వంట చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి, ‘‘కొబ్బరి బోండం లోపల చికెన్‌ రైస్‌ని బేక్‌ చేశాను. లాక్‌డౌన్‌ పూర్తయ్యేసరికి కొత్త కొత్త వంటకాల రెసిపీల పేటెంట్‌ హక్కులు తీసుకోవాల్సి ఉంటుందేమో?’’ అన్నారు విష్ణు. తనయుడు వంట చేస్తుంటే మోహన్‌బాబు పక్కనే ఉండి చూస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు