బెస్ట్‌ గిఫ్ట్‌ ఇస్తాను : చరణ్‌

20 May, 2020 12:15 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరో రామ్‌చరణ్‌ కూడా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. ‘నా ప్రియమైన సోదరుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నేను నీకు రిటర్న్‌ గిఫ్ట్‌ బాకీ ఉన్నానని తెలుసు. కానీ నేను ఉత్తమమైన గిఫ్ట్‌ ఇస్తానని మాట ఇస్తున్నాను. మరెన్నో సెలబ్రేషన్‌ వేచిచూస్తున్నాయి.. ’ అని పేర్కొన్నారు. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్‌ బర్త్‌డే రోజున స్పెషల్‌ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్‌ బర్త్‌డే ఎలాంటి స్పెషల్‌ వీడియో విడుదల చేయడం సాధ్యపడటం లేదని చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి : తారక్‌కు బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌‌ స్పెషల్‌ విషెస్‌..)

అంతులేని నవ్వులు.. 
ప్రముఖ అశ్వినీదత్ కుమార్తె స్వప్న కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ఆమె షేర్‌ చేశారు. ‘క్రేజీ సంభాషణలు, విలువైన సమాచారం, అంతులేని నవ్వులు, రాజా సార్‌ నైట్స్‌.. ఇంకా ఎన్నో.. హ్యాపీ బర్త్‌ డే ఫ్రెండ్‌’ అని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్‌, స్వప్న మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే.

ఇంతకంటే మంచి భీమ్‌ నాకు దొరకడు..
మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి కూడా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. ‘నువ్వు నా జర్నీలో తొలి నుంచి ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్‌ డే డియర్‌ తారక్‌. నీకంటే మంచి భీమ్‌ నాకు దొరకడు’ అని పేర్కొన్నారు. (చదవండి : ఎన్టీఆర్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌..)

crazy conversations Immense information Endless laughs raja sir nights and many more.. Happy bday friend:) @jrntr

A post shared by Swapnadutt Chalasani (@swapnaduttchalasani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా