రాజ మార్తాండ!

1 May, 2018 00:34 IST|Sakshi
రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ కొత్త డైట్‌ను ఫాలో అవుతున్నారు. కొత్త సినిమాలోని లుక్‌ కోసం జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్నారు. మరి రామ్‌చరణ్‌ డైట్‌ సీక్రెట్స్‌ అండ్‌ వర్కౌట్స్‌ డిటైల్స్‌ ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా? ఆయన సతీమణి ఉపాసన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి ఆమె రామ్‌చరణ్‌ వర్కౌట్స్‌కి చెందిన ఓ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘‘స్ట్రిక్ట్‌ ట్రైనింగ్‌ కోసం ట్రైనర్‌ రాకేశ్‌ ఆర్‌. వడియార్‌తో మిస్టర్‌ సి (రామ్‌చరణ్‌) మళ్లీ కలిశారు. రాకేశ్‌ని సల్మాన్‌ బాయ్‌ స్పెషల్‌గా రామ్‌చరణ్‌ కోసం సజెస్ట్‌ చేశారు?’’ అని ఉపాసన పేర్కొన్నారు.

‘ధృవ’ సినిమాలో రామ్‌చరణ్‌ ఫిజిక్‌ చాలా బాగుంటుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న తాజా సినిమా కోసం మళ్లీ అలాంటి ఫిజిక్‌ని ట్రై చేస్తున్నారు చరణ్‌. ఈ సినిమాకు ‘రాజ మార్తాండ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్‌. ఈ సినిమా బీహర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబ్‌రాయ్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఆల్రెడీ విలన్‌ ఎంట్రీని షూట్‌ చేశారు చిత్రబృందం. ప్రస్తుతం రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

మరిన్ని వార్తలు