చిరుకు చిరుత విషెస్‌

22 Aug, 2019 11:48 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజును అభిమానులు పండగలా జరుపుకుంటున్నారు. బుధవారం సాయంత్రం నుంచే సెలబ్రేషన్స్ ప్రారంభించిన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలోనూ సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయిలో చిరంజీవికి సంబంధించిన మూడు హ్యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

చిరు తనయుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నాతో పాటు ఎన్నో లక్షల మందికి స్ఫూర్తి, మార్గదర్శి. అందరూ మిమ్మల్ని మెగాస్టార్‌ అంటారు. నేను మాత్రం అప్పా అని పిలుస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా. ఇలాగే మాకు స్ఫూర్తిని ఇస్తూనే ఉండండి’ అంటూ చిరుతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు చరణ్‌.

You've been an inspiration, a mentor and a guide to millions including me. They call you #MEGASTAR and I call you Appa. Wish you a very happy birthday Appa. May you continue inspiring all of us. Love you a lot. #HBDMegastarChiranjeevi

A post shared by Ram Charan (@alwaysramcharan) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా