అంచనాలను మించేలా...

5 Sep, 2018 00:13 IST|Sakshi

‘రంగస్థలం’ వంటి భారీ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న తాజా చిత్రం షెడ్యూల్‌ అజర్‌ బైజాన్‌లో మంగళవారం నుంచి ప్రారంభమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దానయ్య డీవీవీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. దానయ్య మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. రామ్‌చరణ్‌– బోయపాటి కాంబినేషన్‌ అనగానే మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంటారో తెలిసిందే. వారి అంచనాలను మించేలా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్‌ సన్నివేశాలను పూర్తి చేశాం. మంగళవారం నుంచి అజర్‌బైజాన్‌లో భారీ ఖర్చుతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం.  25 రోజల పాటు జరగబోయే ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌ పాల్గొంటుంది. ఈ చిత్రాన్ని జనవరి 11న రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. రీసెంట్‌గా తెరకెక్కించిన పండగ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్‌ ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటుందని సమాచారం. ప్రశాంత్, వివేక్‌ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వి.వై.ప్రవీణ్‌కుమార్, సహ నిర్మాత: కల్యాణ్‌.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా