‘ఇక్కడ రామ్‌.. రామ్‌ కొణిదెల’

9 Nov, 2018 10:31 IST|Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భరత్‌ అనే నేను ఫేం కియారా అ‍ద్వానీ ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్‌. దీపావళి కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. బోయపాటి మార్క్‌ మాస్‌ క్యారెక్టర్‌లో చరణ్‌ ఇరగదీశాడు. 49 సెకన్ల ఈ టీజర్‌ను మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో పవర్‌ ప్యాక్డ్‌గా రెడీ చేశారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు