చరణ్ రెండు పడవల ప్రయాణం

2 Mar, 2017 10:54 IST|Sakshi
చరణ్ రెండు పడవల ప్రయాణం

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్కు రెడీ అవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరోసారి రెండు పడవల ప్రయాణం చేయడానికి రెడీ అవుతున్నాడు. ధృవ సినిమా సమయంలోనూ నటుడిగా తన సినిమాకు పనిచేస్తూనే నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా పనులను చూసుకున్నాడు చెర్రీ. ఇప్పుడు మరోసారి అదే రిస్క్కు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం సుకుమార్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చరణ్, ఈ సినిమాతో పాటు చిరంజీవి 151వ సినిమా చర్చల్లోనూ పాల్గొంటున్నాడు. చిరు, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేయటం దాదాపుగా కన్ఫామ్ అయిపోవటంతో.., త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో మరోసారి నటుడిగా నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చరణ్కు తప్పేలా లేదు.