బాబాయ్ ట్రైలర్పై అబ్బాయ్ కామెంట్

19 Mar, 2017 14:05 IST|Sakshi
బాబాయ్ ట్రైలర్పై అబ్బాయ్ కామెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో శనివారం రిలీజ్ చేశారు. అభిమానుల మెచ్చే అన్ని అంశాలతో రూపొందించిన ఈ ట్రైలర్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్పై స్పందించాడు. తన ఫేస్ బుక్ పేజ్లో కాటమరాయుడు ట్రైలర్ లింక్ను పోస్ట్ చేసిన చెర్రీ.. 'పవర్ ప్యాక్డ్ సెలబ్రేషన్లా ఉంది.. మన అందరి కాటమరాయుడు మార్చి 24 నుంచి థియేటర్లలో' అంటూ కామెంట్ చేశాడు.

కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకు మెగా కుటుంబం నుంచి ఎవరినీ ఆహ్వానించని నేపథ్యంలో పవన్పై విమర్శలు వినిపించాయి. అయితే వేదిక మీద చిరును ఉద్దేశించి 'అన్నయ్యే అసలైన హీరో.. నేను కాదు' అంటూ మెగా అభిమానులలో జోష్ నింపాడు పవర్ స్టార్. ప్రస్తుతం రామ్ చరణ్ కాటమరాయుడు ట్రైలర్ పై స్పందించటం కూడా మెగా అభిమానుల్లో జోష్ తీసుకువచ్చింది.