వీడియో మెసేజ్ పంపిన చరణ్

16 Nov, 2017 11:06 IST|Sakshi

ఇటీవల కాలంలో రామ్ చరణ్ లో చాలా మార్పు వచ్చింది. సినిమాల ఎంపికతో పాటు ఫ్యాన్స్ ఇండస్ట్రీ ప్రముకులతో ఆయన వ్యవహరించే తీరులో కూడా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో చాలా ఆవేశంగా కనిపించిన చరణ్ ఇప్పుడు హుందాగా ఉంటున్నాడు. అంతేకాదు తరుచూ అభిమానులను కలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా తన సినిమా సాంకేతిక నిపుణుడి కొడుకు పుట్టిన రోజున వీడియో మెసేజ్ పంపి సర్ ప్రైజ్ చేశాడు చరణ్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్. బుధవారం రత్నవేలు కొడుకు పుట్టిన రోజు సందర్భంగా చరణ్ ఓ వీడియో మేసేజ్ ను పంపించాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రత్నవేలు, చరణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు.

మరిన్ని వార్తలు