డబుల్‌ రోల్‌

16 Jun, 2018 00:34 IST|Sakshi
రామ్‌ చరణ్‌

ఒకపక్క మేకప్‌ వేసుకుంటూ ఇంకో పక్క లెక్కలు వేస్తున్నారట రామ్‌ చరణ్‌. ఈ లెక్కకో రీజనింగ్‌ ఉంది. అంటే ఎవరి లెక్కలైనా తేల్చాలనుకుంటున్నాడేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఇది ‘సినిమా లెక్క’. అంటే.. బడ్జెట్‌ గురించిన లెక్క. ఈ లెక్కలు తండ్రి చిరంజీవితో తాను నిర్మిస్తున్న ‘సైరా’ కోసం. హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరోపక్క ‘సైరా’ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు చరణ్‌. నటుడిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణంతో ఫుల్‌ బిజీగా ఉన్నారాయన. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్‌ హైదరాబాద్‌లో ఒకేచోట జరుగుతుండడంతో ‘సైరా’ సెట్స్‌ను కూడా సందర్శిస్తున్నారట చరణ్‌.

ఈ చిత్రాన్ని చరణ్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకే ఖర్చు విషయంలో, టెక్నీషియన్స్‌ విషయంలో అస్సలు రాజీపడటంలేదు. ఈ సినిమా గురించి చరణ్‌ మాట్లాడుతూ – ‘‘వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీ మార్కెట్‌ విస్తృతంగా పెరుగుతోంది. ఆ డిమాండ్‌కు తగ్గట్టుగానే ‘సైరా’ చిత్రాన్ని ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నాం. అలాగే చైనా లాంటి దేశాల్లో ఇండియన్‌ సినిమాకు మార్కెట్‌ కూడా బాగా పెరిగింది. అక్కడికి కూడా ఈ సినిమాను తీసుకువెళ్లాలనే ప్లాన్‌లో ఉన్నాం. ప్రతి ప్రాంతంలో ఉన్న ఫిల్మ్‌ లవర్‌కి  మా సినిమా దగ్గరవ్వాలన్నది మా ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని పేర్కొన్నారాయన. ఒకవైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా రామ్‌ చరణ్‌ డబుల్‌ రోల్‌ ప్లే చేస్తున్నారన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

అందుకు ఇది సమయం కాదు: రహమాన్‌

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

సినిమా

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

నా వంతు విరాళం సేకరిస్తున్నాను