ప్లీజ్‌ సుక్కూ...టైటిల్‌ చెప్పు!

29 May, 2017 00:29 IST|Sakshi
ప్లీజ్‌ సుక్కూ...టైటిల్‌ చెప్పు!

అభిమానులందరూ నాకొక హెల్ప్‌ చేయండంటూ రామ్‌చరణ్‌ ఓ రిక్వెస్ట్‌ చేశారు. అదేంటంటే... సుకుమార్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమాకు టైటిల్‌ కన్ఫర్మ్‌ చేయమని దర్శకుణ్ణి నెల రోజులుగా రిక్వెస్ట్‌ చేస్తున్నారట. సుక్కు (దర్శకుడు ముద్దుపేరు) నాలుగైదు మంచి మంచి టైటిల్స్‌ అనుకున్నారు. వాటిలోంచి ఏది సెలక్ట్‌ చేస్తారో? నాకు తెలీదంటున్నారు చరణ్‌.

 త్వరగా టైటిల్‌ కన్ఫర్మ్‌ కావాలంటే ‘‘ప్లీజ్‌ సార్‌... మాకు ఓ టైటిల్‌ ఇవ్వండి’’ అని సుకుమార్‌పై ఏదో రూపంలో ఒత్తిడి పెంచమని అభిమానులను చరణ్‌ కోరారు. అదండీ సంగతి! మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌. సమ్మర్‌ హీట్‌ వల్ల షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చారు. త్వరలో మళ్లీ మొదలు కానుంది.