హార్డ్‌ వర్క్‌... స్మాల్‌ పార్టీ

23 May, 2018 00:28 IST|Sakshi

బ్యాంకాక్‌కు బై బై చెప్పారు రామ్‌చరణ్‌ అండ్‌ టీమ్‌. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన హీరోగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ మూవీ టీమ్‌ షూటింగ్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ బ్యాంకాక్‌ షెడ్యూల్‌ కంప్లీటైంది.  ‘‘షెడ్యూల్‌ పూర్తి చేశాం. ఇప్పుడు స్మాల్‌ పార్టీ చేసుకుంటున్నాం.

ఇంత హార్డ్‌ వర్క్‌ చేశాక ఆ మాత్రం పార్టీ చేసుకోవడానికి మేం అర్హులమే’’ అని కియారా పేర్కొన్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం. బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో స్నేహ, ప్రశాంత్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలన్నది చిత్రబృందం ఆలోచనట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా