కచ్చితంగా వెన్నుపోటు పొడిచారు : వర్మ

20 Oct, 2018 16:53 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ, ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమాను తిరుపతిలో లాచనంగా ప్రారంభించిన వర్మ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్‌ కథతో ఎవరెన్ని సినిమాలు తీసినా కేవలం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు మాత్రమే ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ సినిమాకు సంబంధించి సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించిన వర్మ మరిన్ని ఇంట్రస్టింగ్‌ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన పరిస్థితులు, పాత్రలను యదాతథంగా చూపించబోతున్నట్టుగా వెల్లడించారు. అదే సమయంలో ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్‌ కోణంలోనే ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవటం నిజమేనన్న వర్మ చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ పడిన క్షోభను చూపించే ప్రయత్నం చేసినట్టుగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు