చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే...

14 Apr, 2017 08:26 IST|Sakshi
చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే...

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ క్షమాపణ చెప్పారు. తనపై చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని పేర్కొన్నారు. ‘చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు మాటలతో వదిలేశాడు. ఆయనకు నిజంగా క్షమాపణ చెబుతున్నా’ని వర్మ ట్వీట్‌ చేశారు.

నాగబాబు తనయుడు, హీరో వరుణ్‌ తేజ్‌ కూడా ఆయన క్షమాపణ చెప్పారు. ‘వరుణ్‌ తేజ్‌.. మీ నాన్న గురించి నాపై చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాన’ని ట్విటర్‌ లో పేర్కొన్నారు. ఖైదీ నెం. 150 సినిమా ప్రీ లాంచ్ వేడుకలో నాగబాబు.. రాంగోపాల్‌ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడంతో వివాదం మొదలైంది. నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ట్విటర్‌ వేదికగా కామెంట్లు చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి