వర్మ 'బ్రూస్ లీ' వీడియో సాంగ్ విడుదల

14 Oct, 2015 19:17 IST|Sakshi
వర్మ 'బ్రూస్ లీ' వీడియో సాంగ్ విడుదల

సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశాడు. ఇప్పటికే 'వర్మ బ్రూస్ లీ' పేరుతో  ట్రైలర్ రిలీజ్ చేసిన ఆయర తాజాగా  ఆ చిత్రంలోని ఒక వీడియో సాంగ్ ని బుధవారం ట్విట్టర్ లో విడుదల చేశారు. దమ్ముంది.. తెగింపు ఉంది...ఇంకా నీకేం కావాలీ అంటూ.. కొనసాగే ఈ పాటలో ఓ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనబడుతుంది. 'వర్మ బ్రూస్ లీ' పాటను  అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5.30 గంటలకి విడుదల అంటూ... రామ్గోపాల్ వర్మ ఇవాళ ఉదయం ట్విట్ చేశారు. అన్నట్టుగానే సాయంత్రం ఆ పాటను విడుదల చేశారు.

అయితే ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో  రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన 'బ్రూస్లీ'  విడుదలకు సిద్ధం అవుతుండగా, తమిళ్లో జివి ప్రకాష్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రేసులోకి వర్మ కూడా వచ్చి చేరారు. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ ఇది తొలి భారతీయ మార్షల్ ఆర్ట్స్ చిత్రమని ఇప్పటికే ప్రకటించారు.

తన ప్రతి సినిమాను వివాదాలతోనే ప్రమోట్ చేసుకునే వర్మ ఈసారి కూడా తన సినిమా ప్రమోషన్ కోసం టైటిల్ వివాదాన్ని తెరమీదకు తెచ్చారన్న వాదన వినిపిస్తుంది. మరి రామ్గోపాల్ 'వర్మ' బ్రూస్ లీ పై ...రామ్చరణ్ బ్రూస్లీ యూనిట్ ఎలా స్పందించారో చూడాలి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి