ఆ సంఘటన కలచివేసింది: వర్మ

7 Jan, 2020 12:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో జరిగే విషయాల మీద నిత్యం ఫోకస్‌ పెట్టి, వివాదాస్పద అంశాలను ఆధారంగా చేసుకొని దానికి తనదైన ఫిక్షన్‌ జోడించి ఆసక్తికరమైన సినిమాలు తీయడంలో దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సిద్ధహస్తుడు. నిత్యం సంచలనాలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ఆయన ఏది చేసినా అది సంచలనమవుతూ ఉంటుంది.

చదవండి: పంజాగుట్ట పీఎస్‌ ఎదుట నిప్పంటించుకున్న మహిళ

చదవండి: లోకేశ్వరి ఆత్మహత్య కేసులో ముమ్మర దర్యాప్తు

తాజాగా ఆయన తన ట్విటర్‌ అకౌంట్‌లో ఒక ఆసక్తికర ట్వీట్‌ చేశారు. దిశ హత్యాచారాన్ని మరువక ముందే ఓ మహిళ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న భయానక సంఘటనను గురించి తెలుసుకుని తన హృదయం ద్రవించిందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇటువంటి వాటికి కఠినమైన సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా​ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన చేసిన ఈ ట్వీట్‌కు సమాధానంగా ఆర్జీవీ సున్నితమైన అంశాలను కూడా అర్థం చేసుకోగలడు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

చదవండి: ఏపీ రాజధానిపై రామ్‌ గోపాల్‌ వర్మ కామెంట్స్‌

చదవండి: వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా