పొగాకు వ్యతిరేక ప్రకటనలను వెక్కిరించిన రాంగోపాల్ వర్మ!

6 Nov, 2013 16:33 IST|Sakshi
పొగాకు వ్యతిరేక ప్రకటనలను వెక్కిరించిన రాంగోపాల్ వర్మ!
వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ, వివాదాల్లో కూరుకుపోవడం మంటే సినీ దర్శకులు రాంగోపాల్ వర్మకు చెప్పలేనంత సరదాగా ఉంటుందేమో. తన ట్విటర్ అకౌంట్ ఆసరాగా చేసుకుని చేసే సంక్షిప్త సందేశాలు కొన్నిసార్లు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ, మరి కొన్నిసార్లూ ఫులీష్ గా, కాంట్రవర్సీగా కనిపిస్తాయి. 
 
సినిమాల ప్రదర్శనకు ముందు దూమపానం, పోగాకు వ్యతిరేక ప్రకటనలను చూపించడంపై తాజాగా రాంగోపాల్ వర్మ ధ్వజమెత్తారు. వినోదం కోసం థియేటర్ కు వచ్చిన చికాకు కలిగించే విధంగా క్యాన్సర్ వ్యాధికి గురైన వారి ఊపిరితిత్తులు, నోటిని చూపిస్తున్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పేర్కోన్నారు. అంతేకాకుండా తన చిన్నతనం నుంచి లక్షలాది దూమపాన వ్యతిరేకం కార్యక్రమాలు నిర్వహించినా.. ఏ ఒక్కడు కూడా సిగిరెట్ మానినట్టు కనిపించలేదని వ్యాఖ్యలు చేశారు. 
 
>