‘యాత్ర’పై వర్మ ప్రశంసలు

12 Feb, 2019 21:48 IST|Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. గత శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. ‘యాత్ర ఒక అద్భుతమైన చిత్రం. వైఎస్సార్‌ గొప్ప నాయకుడు. వైఎస్సార్‌లోని నిజమైన కోణాన్ని ఈ చిత్రం అవిష్కరించింది. మహి వీ రాఘవ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మమ్ముట్టి వైఎస్సార్‌ పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశార’ని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మమ్ముట్టి, రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

మరిన్ని వార్తలు