భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ

21 Feb, 2019 10:16 IST|Sakshi

ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న రామ్‌ గోపాల్‌ వర్మ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అంతేకాదు సినిమాపై విమర్శలు చేస్తున్న వారిపై కూడా తనదైన స్టైల్‌లో విరుచుకు పడుతున్నాడు. తాజాగా పార్టీ నేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. అంతేకాకుండా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా చూడద్దొని...ఎన్టీఆర్‌ గురించి వాస్తవాలు తెలియాలంటే బాలకృష్ణ తీసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చూడాలని ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. (లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంపై చంద్రబాబు ఉలిక్కిపాటు..)

ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వర్మ ఓ వీడియో టీజర్‌తో కౌంటర్‌ ఇచ్చారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో భయపడిన సీబీన్‌ రియాక్షన్‌ అంటూ ఓ వీడియోనే తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు వర్మ. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్‌కు మీ నుండి వచ్చే రియాక్షన్‌ ఏంటి సార్‌’ అని  జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న రానా ‘మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే’ అని ఆవేశంగా చెప్పే డైలాగ్‌ను జోడించి వీడియో రిలీజ్ చేశాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. వర్మ ముందు నుంచి చెపుతున్నట్టుగానే అసలు నిజాలను బయటపెడుతున్నాడంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాను మార్చి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు వర్మ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు