వ‌ర్మ టీమ్ మెంబ‌ర్‌కు క‌రోనా?

5 Jul, 2020 10:01 IST|Sakshi

క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని సినిమాల షూటింగ్‌ల‌కు స‌డ‌న్ బ్రేక్ ప‌డింది. అయితే తాను సినిమా తీయాల‌నుకుంటే దాన్ని కంటికి క‌నిపించని వైర‌స్ కూడా ఆప‌లేద‌ని నిరూపించారు సంచ‌లన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అలా లాక్‌డౌన్‌లోనే 'క్లైమాక్స్'‌, 'నేక్‌డ్' వంటి చిత్రాల‌ను నిర్మించి విడుద‌ల చేశారు కూడా. వీటితో పాటు గ‌తంలో సంచ‌ల‌నం రేపిన ప్ర‌ణ‌య్ హ‌త్య కేసును ఆధారంగా తీసుకుని 'మ‌ర్డ‌ర్'‌, ప్ర‌స్తుతం విజృంభిస్తున్న మ‌హ‌మ్మారిపై 'క‌రోనా వైర‌స్', గాంధీ హ‌త్యోదంతంపై 'ది మ్యాన్ హు కిల్డ్ గాంధీ', ‘కిడ్నాప్‌ ఆఫ్‌ కత్రినా కైఫ్‌’, 'పవర్‌ స్టార్‌‌' చిత్రాల‌ను సైతం ప్ర‌క‌టించారు. (ఆర్జీవీ అదిరిపోయే సమాధానం‌)

తాజాగా 12'0' క్లాక్‌తో మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్ట‌ను‌న్నారు. ఈ క్ర‌మంలో వ‌ర్మ టీమ్‌లో ఒక‌రికి క‌రోనా సోకిన‌ట్లు ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ.. "మా టీమ్‌లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం వ‌ల్ల షూటింగ్ నిలిపివేశామంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. మేము షూటింగ్ మొద‌లు పెట్ట‌డానికి ముందే ప‌రీక్ష‌లు చేయించుకున్నాం. అందులో అంద‌రికీ నెగెటివ్ అని వ‌చ్చింది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను మేము తు.చ త‌ప్ప‌కుండా పాటిస్తున్నాం" అని స్ప‌ష్ట‌త ఇచ్చారు. (వినూత్న రీతిలో వర్మ 12'0' క్లాక్‌ ట్రైలర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు