వైశ్రాయ్‌ ఘటనే పెద్ద కుట్ర

23 Mar, 2019 00:31 IST|Sakshi
రామ్‌గోపాల్‌ వర్మ

‘‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 29న విడుదల చేస్తున్నాం. సెన్సార్‌ సమస్య వల్ల విడుదల వాయిదా పడలేదు. మా సినిమా విడుదలకు కోర్టు, ఎలక్షన్‌ కమిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఎన్నికలు అయిపోయేవరకూ మా చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వరంటూ మాకు సమాచారం అందడంతో బోర్డుపై కేసు పెట్టాలనుకున్నాం. అయితే అలాంటిదేమీ లేదని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం’’ అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. విజయ్‌ కుమార్, యజ్ఞాశెట్టి లీడ్‌ రోల్స్‌లో రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్‌ సమర్పణలో రాకేష్‌ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వర్మ పంచుకున్న విశేషాలు...

బాలకృష్ణకి అంకితం
ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ చేద్దామని బాలకృష్ణ అన్నారు. పొలిటికల్‌ విషయాలు తెలుసుకునేందుకు ఆయనే కొందరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక జరిగిన ఘటన లేకుండా చేద్దామని బాలకృష్ణ అన్నారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో మా కాంబినేషన్‌లో సినిమా ఆగిపోయింది. అయితే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే మాత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. అందుకే గతంలో ప్రెస్‌మీట్‌లో చెప్పినదే మళ్లీ చెబుతున్నా.. ఈ సినిమా బాలకృష్ణకే అంకితం.

నా కెరీర్‌లో చాలా ప్రత్యేకం
 ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నా కెరీర్‌లో  చాలా ప్రత్యేకమైన సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన తెలుగు వ్యక్తి ఎన్టీఆర్‌గారు. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారాయన. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఎక్స్‌ట్రీమ్‌ ట్రాజెడీని తెరకెక్కించడం డిఫికల్ట్, ఎమోషనల్‌ టాస్క్‌. దాన్ని జస్టిస్‌ చేయడం చాలా పెద్ద బాధ్యత. దాన్ని గుర్తు పెట్టుకునే ఎన్టీఆర్‌గారి వ్యక్తిత్వానికి ఏమాత్రం అగౌరవం కలగకుండా ఈ సినిమా తీశా.
 
నేను నమ్మిన నిజంతో...
‘వైశ్రాయ్‌ హాటల్‌’ సంఘటన జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. 25ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనలో వాస్తవం ఏంటన్నది నాకు తెలియదు. ఆ సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో ఉండి, ప్రస్తుతం లైమ్‌లైట్‌లో లేని దాదాపు 35మందిని కలిసి ఏం జరిగిందన్నది తెలుసుకుని, నేను నిజమని నమ్మిన దాంతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం తీశా. నా మాటను నమ్మని వాళ్లకు సినిమాటిక్‌గా అనిపించవచ్చు. ఈ సినిమా చూశాక ‘ఇలా జరగలేదు’ అనుకుంటే వారు నమ్మినదాన్ని సినిమా తీసుకోవచ్చు.

నిజం బయటకు వస్తుందని భయం
మాఫియా నేపథ్యంలో బాలీవుడ్‌లో సినిమాలు తీసినా వివాదాలు లేవు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విషయంలో మాత్రం వివాదాలు రావడానికి కారణం నిజం బయటకు వస్తుందని, ఇంతకు ముందెప్పుడూ తెలియని నిజాలు ఇప్పుడు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయేమోననే భయం. అందుకే సినిమా విడుదల కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవతలివారి దగ్గరే నిజం ఉంటే, సినిమాని ఆపడానికి ఎందుకు ప్రయత్నించాలి?

లక్ష్మీపార్వతిగారు వచ్చాకే...
ఈ సినిమాని లక్ష్మీపార్వతిగారి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చెప్పలేదు. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి ఆమె వచ్చినప్పటి నుంచే సినిమా తీశా. ఆమె పైన చాలా అభియోగాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్‌గారిలాంటి సూపర్‌స్టార్‌కి మామూలు వాళ్లు దగ్గరవలేరు కదా? అంటే ఆమెలో ఏదో ప్రత్యేకం ఉందనేగా? ఈ చిత్రంలో  నాదెండ్ల భాస్కరరావుగారి ఎపిసోడ్‌ ఉండదు.

అందుకే కొత్తవారితో...
రియలిస్టిక్‌ క్యారక్టర్లను పెద్దగా ఫేమస్‌ కానివారు చేసినప్పుడు ఆ పాత్రలు బాగా ఎలివేట్‌ అవుతాయని నా నమ్మకం. అందుకే ‘వీరప్పన్, వంగవీటి’ చిత్రాలను కూడా కొత్తవాళ్లతోనే చేశా. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో విజయ్‌కుమార్‌ చక్కగా ఒదిగిపోయారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఆయన రెండు నెలలు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌గారిని మనం సినిమాల్లోనూ, పొలిటికల్‌ స్పీచుల్లోనే చూశాం. కానీ, ఆయన లివింగ్‌ రూమ్‌లో, బెడ్‌రూమ్‌లో వ్యవహరించిన తీరు పట్టుకోవడమంటే ఏ నటుడికైనా ఒక ట్రెమండస్‌ ఎమోషనల్‌ డెప్త్‌ను కేప్చర్‌ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆయన చాలా బాగా చేశారు. యజ్ఞాశెట్టి కన్నడ నటి.

ఏ పార్టీకీ సపోర్ట్‌ కాదు
ఈ సినిమా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనడం అవాస్తవం. మనం ఏం చెప్పినా అవతలివాళ్లు  ఏది నమ్మాలనుకుంటే దాన్నే నమ్ముతారు. నిర్మాత రాకేష్‌రెడ్డి వైసీపీ అని ముందు నాకు తెలియదు.. తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు.. అది వేరే విషయం. 25 ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది?

అవి అవాస్తవాలు
‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదల ఆపేస్తే రూ. 50 కోట్లు ఇస్తామని నిర్మాతకి ఆఫర్‌ వచ్చిందనేమాట అవాస్తవం. నేను సినిమా మేకర్‌ని. కష్టపడి ఓ సినిమా చేసినప్పుడు దాన్ని రిలీజ్‌ చేయాలనే అనుకుంటా. అంతేకానీ విడుదల చేయకూడదనుకోను. సినిమాను విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లకు బెదిరింపులు వచ్చాయనడం కూడా తప్పు. అవన్నీ యూట్యూబ్‌ చానళ్లలో వచ్చిన విషయాలు.

ఏది అబద్ధమో?
నాకు చంద్రబాబు మూలాన నష్టం జరగలేదు.. వైఎస్‌ జగన్‌ వల్ల లాభం కూడా లేదు. అటువంటప్పుడు బాబుగారికి వ్యతిరేకంగా ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది?. ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ గురించి నేను బాలకృష్ణని కలిశాను. కానీ, ఆయన నన్ను కలవలేదంటున్నారంటే.. ఆయన చెప్పింది అబద్ధమై ఉండాలి. లేదంటే నేను చెప్పిందైనా అబద్ధం అయి ఉండాలి. దేన్ని నమ్ముతారో మీ ఇష్టం (నవ్వుతూ).

చంద్రబాబుగారే విడుదల చేయిస్తారు
ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకరి భావ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మరొకరికి లేదు. మా సినిమాని ఆపడం 100శాతం ఎవరి వల్లా కాదు. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రి కనుక లా అండ్‌ ఆర్డర్‌ ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా మా సినిమాని ఏపీలో ఆయనే విడుదల చేయిస్తారు.

నాకు చాలా వ్యసనాలున్నాయి
వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ నాకు వ్యసనం అయిపోయిందనే మాట ఉంది. నాకు ఉన్న చాలా వ్యసనాల్లో ఇది కూడా ఓ వ్యసనమైనా పర్వాలేదు. నా కెరీర్‌లో 90శాతం ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ కాంట్రవర్శీలను తీసుకునే సినిమాలు చేశా. ‘సర్కార్, రక్తచరిత్ర, వంగవీటి’... ఇలా ఏదైనా అలాంటిదే.
‘కథానాయకుడు’ చూశా
బాలకృష్ణ ‘కథానాయకుడు’ సినిమా చూశా. అందులో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి నేనెవరిని? అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎమోషనల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ లేకుండా సీన్లను పేర్చారనిపించింది.  

అది కరెక్ట్‌ కాదు
ఆడియన్స్‌ ఎక్కువగా నెగటివిటీని ఇష్టపడతారనడం కరెక్ట్‌ కాదు. సినిమాలో ఫండమెంటల్‌గా ఎమోషనల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ అనేది మెయిన్‌. గాంధీ సినిమా చేస్తున్నామని చెప్పి బ్రిటీష్‌ని అందులో నుంచి తీసేస్తే ఎమోషనల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ ఎక్కడ ఉంటుంది? సినిమా అంటే ఆయన ఎప్పుడు పుట్టారు? ఏ స్కూల్‌కి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అన్నది కాదు. బ్రిటీషర్ల రాకతో సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది?

ఓటర్లకు అవగాహన ఉంటుంది
నాయకులు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చిన విధానంపై ఓటర్లకు ఓ అవగాహన ఉంటుంది. ఆ నమ్మకంతోనే వారికి ఇష్టమైన వ్యక్తికి ఓటు వేస్తారు. వారు బాగా నమ్మిన వ్యక్తి గురించి సడన్‌గా ఏదో తెలిసి నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి.. ఏ మేరకు సాధ్యమవుతుంది? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందనే విషయం నాకు తెలియదు.

ముందుపోటు పొడుస్తా...
నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఎప్పుడూ ముందుపోటే పొడుస్తా.

నేను జ్యోతిష్కుడిని కాదు
ఆంధ్రప్రదేశ్‌కి కొత్త ముఖ్యమంత్రి ఎవరని చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. కాకపోతే ఎవరు వచ్చినా  ఫరక్‌ పడదు. మార్పు అనేది ప్రాసెస్‌లో రావాలేగానీ, ఎన్నికలతో జరుగుతుందని అనుకోను. కాకపోతే సీఎంగా ఒక చాయిస్‌ పవన్‌ కల్యాణ్, మరో చాయిస్‌ కేఏ పాల్‌. పవన్‌ కల్యాణ్‌ మంచి అందగాడు. తనొస్తే అందమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు మధ్యలోని సినిమా పేజీల్లో చూసే అతని ఫొటో ముఖ్యమంత్రి అయితే రోజూ మొదటి పేజీలో చూడొచ్చు. కేఏ పాల్‌ ముఖ్యమంత్రి అయితే ప్రతి రోజూ కామెడీనే. రూ.200 పెట్టి కామెడీ సినిమా చూడాల్సిన అవసరం ప్రజలకు రాదు. ఆయన గతంలో నన్ను ముంబైలో కలిశారు. మనిషి పుట్టి దాదాపు 60వేల ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేఏ పాల్‌ అంత అబద్ధాలు చెప్పేవారిని నేనెప్పుడూ చూడలేదు.

కేసీఆర్‌ బయోపిక్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్‌ గురించి రీసెర్చ్‌ చేస్తున్నా. ఇందులో వివాదాలేమీ ఉండవు. త్వరలోనే వివరాలు చెబుతా. నేను తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌లో ఒకటి సెప్టెంబరులో విడుదల అవుతుంది.

చంద్రబాబుగారే ఓ సినిమా తీసుకోవచ్చు
ఎన్టీఆర్‌గారి వైపు నుంచి చూస్తే వైశ్రాయ్‌ హోటల్‌ ఘటనలో 100శాతం కుట్ర దాగి ఉంది. నాదెండ్ల భాస్కరరావుగారు పార్టీ కోసం తప్ప ఎన్టీఆర్‌గారిని పెద్దగా కలిసింది లేదు. సీబీఎన్‌ (చంద్రబాబునాయుడు), రక్తసంబంధీకులు, దగ్గరివాళ్లు చేసిన ‘వైశ్రాయ్‌’ కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. చంద్రబాబు పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఆయనదే నిజమైనప్పుడు బాబుగారే ఒక సినిమా తీసుకోవచ్చు.

వార్నింగ్‌ ఇచ్చారు
ఈ సినిమా తీస్తున్న టైమ్‌లో ‘ఇ లాంటి వ్యవహారాలు నీకెందుకు? సినిమా తీయకపోవడమే మంచిది’ అంటూ నాకు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ, నేనెవరి సలహాలు పాటించను (నవ్వుతూ).. సినిమా పూర్తయ్యాక విడుదల ఆపాలంటూ టీవీ డిబేట్‌లో ఉన్నప్పుడు వార్నింగ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారు. మనం లీగల్‌గా కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు డెమోక్రటిక్‌ కంట్రీలో ఏదీ కష్టం కాదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!