వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

8 Dec, 2019 13:36 IST|Sakshi

ముంబై: ఏం చేసినా వివాదంతో ప్రారంభమై.. వివాదంతో ముగిసి..సెన్సేషన్ కావడం ఒక్క రామ్‌ గోపాల్‌ వర్మకే సాధ్యం. తాజాగా ఆయన నిర్మించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు ముందే ఎంత వివాదాస్పదం అవుతున్నదో తెలిసిన విషయమే. ఆంధ్రప్ర‌దేశ్‌కి చెందిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల నేప‌థ్యంలో అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు పేరుతో వ‌ర్మ‌ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ వివాదాస్పద చిత్రంపై కేఏ పాల్ మండిపడుతూ..  సినిమాను విడుదల చేయొద్దంటూ కోర్టులో పిటిష‌న్ కూడా వేశారు.  అయితే తాజాగా.. ఈ  మూవీకి సెన్సార్ క్లియరెన్స్ లభించింది. దీంతో వర్మ సెన్సార్ సర్టిఫికేట్‌‌ను కేఏ పాల్ చేతుల మీదుగా అందుకుంటున్నట్లు ఓ మార్ఫింగ్‌ ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

అయితే ఇప్పుడు వర్మ సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలో వర్మ మార్క్ మార్ఫింగ్ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరుస వివాదాల నేపథ్యంలో మూవీ టైటిల్‌ను కూడా మార్చిన సంగతి తెలిసిందే. కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్‌ను కాస్త... అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 12న సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇటీవలే వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు.

చదవండి: వర్మ మూవీకి లైన్‌ క్లియర్‌.. ఆ రోజే రిలీజ్‌..!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు