ట్రంప్‌ పర్యటనపై వర్మ సెటైర్లు

24 Feb, 2020 08:52 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 24, 25 తేదీల్లో ఇండియాకు వస్తున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్‌’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదిలా ఉండగా ట్రంప్‌ భారత పర్యటనపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ మధ్య కాలంలో సైలెంట్‌గా ఉన్న కాంట్రవర్సీ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ  కూడా తాజాగా డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనపై ట్వీటర్‌ వేదికపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సెటైర్లు వేస్తున్న వర్మ.. మరోసారి ట్రంప్‌ పర్యటనను ఉద్దేశించి పలు ఆసక్తికర ట్వీట్‌లు చేశారు.(‘అగ్ర’జుడి ఆగమనం నేడే)

‘ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించడానికి మనం వేలకోట్లు ఖర్చు చేశాం.. కానీ ప‍్రధాని నరేంద్ర మోదీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు చేస్తారా..? అది అమెరికా.. భారత్‌ కాదు’’.అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. అదే విధంగా ‘ట్రంప్‌ ఇండియాకు రావడానికి ఒకే ఒక కారణం.. తను ఇండియా వస్తున్నాడంటే ఎంత మంది అతన్ని చూడటానికి వస్తారో అని ఆసక్తిగా ఉన్నాడు. ఎందుకంటే దీనిని ఆయన చనిపోయే వరకు గొప్పగా చెప్పుకోవచ్చు.తన కోసం 10 మిలియన్ల మంది రావచ్చు.. కానీ ట్రంప్‌ 15 మిలియన్ల జనాలు వచ్చారని అబద్ధం చెబుతాడు.’ అంటూ  మరో ట్వీట్‌ చేశాడు.

(ట్రంప్‌ పర్యటన: వర్మ సంచలన వ్యాఖ్యలు!)

‘ఏ భారతీయుడైన తమ సొంత సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తారని నేను అనుకోవడం లేదు. అలాంటిది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్లు ఆసక్తిగా చూస్తారని ఆశించడం సరైనది కాదు. దీని కంటే ఓ బాలీవుడ్‌ నైట్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేయడం ఉత్తమం’ అని ట్రంప్‌ పర్యటను టార్గెట్‌ చేసిన వర్శ ఆయనపై మరికొన్ని పంచ్‌లు విసిరారు..

ట్రంప్‌ దంపతుల లవ్‌ స్టోరీ

మోదీ, నేను మంచి ఫ్రెండ్స్‌!

‘అగ్ర’జుడి ఆగమనం నేడే

మరిన్ని వార్తలు