వారికి వ్యతిరేకంగానే ‘టైగర్‌ కేసీఆర్‌’ : ఆర్జీవీ

22 Apr, 2019 15:42 IST|Sakshi

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే రామ్‌గోపాల్‌ వర్మ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఓ చిత్రాన్ని తీయబోతోన్నట్లు ప్రకటించాడు. టైటిల్‌ను ఫిక్స్‌ చేయడమే.. కాకుండా ఓ సాంగ్‌ను పాడుతూ వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఈ పాటపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆంధ్రోడా అంటూ కాస్త పరుష పదాలను వాడుతూ రిలీజ్‌ చేసిన ఈ పాటపై ఆర్జీవీ వివరణ ఇచ్చుకున్నాడు.

తాను తీయబోయే సినిమా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉండదని, తెలంగాణ ప్రజలను అవమానపరిచిన కొంతమంది ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే ‘టైగర్‌ కేసీఆర్‌’ ఉంటుందని  తెలిపారు. తెలుగు ప్రజలందర్నీ కేసీఆర్‌ ప్రేమించారని, ఆయన యుద్దం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఆంధ్ర నాయకుల మీదేనని అన్నారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు