గృహ హిం‍సపై ఆర్జీవీ ట్వీట్‌

4 May, 2020 20:47 IST|Sakshi

మద్యం కొనుగోలు చేసే మహిళలు గృహ హింసపై ఫిర్యాదు చేయడానికి అనర్హులంటూ వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోమవారం ట్వీట్‌ చేశాడు. లాక్‌డౌన్ దేశంలో పేరుగుతున్న గృహ హింస కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి మద్యం దుకాణాల ప్రారంభానికి అనుమతించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహిళలపై గృహ హింస కేసులు పెరిగిన క్రమంలో ప్రభుత్వం మద్యం దుకాణాల తెరిస్తే ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని, అంతేగాక దీని ప్రభావం కుటుంబ సభ్యులపై, పిల్లలపై తీవ్రంగా చూపుతుందని వారు ధ్వజమెత్తారు.

 అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. వైన్‌ షాపుల ఎదుట మహిళలు వరుసలో నిలబడి ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. ‘‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం’’ అంటూ తనదైన శైలిలో ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. (రంగోలికి సోనా మద్దతు.. సెలబ్రిటీల ఫైర్‌!)

ఇక ఆర్జీవీ ట్వీట్‌కు బాలీవుడ్‌ సింగర్‌ సోనా మోహపత్రా స్పందిస్తూ.. ‘‘డియర్‌ మిస్టర్‌ ఆర్జీవీ. అసలైన విద్యావంతులు ఎలా ఉండాలని నేర్పించే వ్యక్తుల వరుసలో మిమ్మల్ని ఈ ట్వీట్‌ చేరుస్తుంది. మీ ట్వీట్ ఎందుకు సెక్సిజం, నైతికత రీక్స్‌ అర్థానికి వీలుగా ఉంది. మహిళలకు, పురుషుల మాదిరిగా మద్యం కొనుగోలు, మద్యం సేవించే హక్కు ఉంది. అయితే మద్యం సేవించాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు’’ అంటూ ఆర్జీవీపై ఆమె మండిపడ్డారు. కాగా మే 4 నుంచి లాక్‌డౌన్‌ మరోసారి పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా లాక్‌డౌన్‌ మూడవ దశలో కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ఇందులో మద్యం, పాన్, పొగాకు అమ్మకాలకు కూడా అనుమతించింది. అయితే మద్యం షాపులు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌, నటి మలైకా అరోరా, రవీణా టాండన్‌లు వ్యతిరేకిస్తూ ట్వీట్‌ చేశారు. (వైన్‌ షాపుల మూతపై వర్మ ట్వీట్‌)

మరిన్ని వార్తలు