కేసీఆర్ పై రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు

7 Dec, 2013 15:17 IST|Sakshi
కేసీఆర్ పై రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర రాజకీయలపై తనదైన శైలిలో స్పందించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై వర్మ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో కేసీఆర్ లాంటి నాయకులు లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవేమోవని పేర్కొన్నాడు. కేసీఆర్ తన మకాం అమెరికాకు మార్చి ఆ దేశ పౌరులకు విభజన భావనలు, ఆలోచనల గురించి చెప్పాలని సూచించాడు. ఇలాంటి నాయకులు అమెరికాను విభజించాలని వాదించగలరని అభిప్రాయపడ్డాడు. వర్మ ఇంకా ఏం ట్వీట్ చేశాడంటే...

  • అమెరికాలో ఏ రాష్ట్రం కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.
  • భారత్లోని రాష్ట్రాలు ఎప్పుడూ సమైక్యంగా లేకపోవడం లేదా సమైక్యంగా ఉంచగల సామర్థ్యం భారతీయులకు లేకపోవడం విభజనకు కారణం కావచ్చు.
  • రాష్ట్రాలను ఎలా సమైక్యంగా ఉంచాలో మనం అమెరికాను చూసి నేర్చుకోవాలి.
  • అమెరికన్లు మద్యం, శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. వేర్పాటు రాజకీయాల గురించి ఆలోచించేంత తీరిక వారికి ఉండదు.
  • అమెరికాలో ఏ రాష్ట్రం కూడా విడిపోవాలని ఎందుకు అడగడం లేదు? అక్కడ కేసీఆర్ లాంటి సమర్థులైన నాయకులు లేకపోవడం వల్లేమో?
  • కెసీఆర్ ఒకవేళ అమెరికా పౌరుడిగా వాషింగ్టన్లో జన్మించినట్టయితే.. ఆయన తన జీవితంలో ఏం సాధించావారో చూడాలనివుంది.