కిందటి జన్మలో రంగీలా తీశా!

29 Dec, 2019 00:16 IST|Sakshi
నైనా గంగూలీ, రామ్‌గోపాల్‌ వర్మ, సూరి

– రామ్‌గోపాల్‌వర్మ

‘‘లవ్‌స్టోరీ చిత్రాల్లో నా పేరు జోడించి కొన్ని యుగాలు అయిపోతుంది. కిందటి జన్మలో ‘రంగీలా’ తీశాను. ‘బ్యూటిఫుల్‌’ చిత్రం ఒక విధంగా ‘రంగీలా’కి సీక్వెల్‌లా ఉంటుంది. ‘ట్రిబ్యూట్‌ టు రంగీలా’ అనేది కేవలం పబ్లిసిటీ కోసం పెట్టింది కాదు’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆర్జీవీ టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై  టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలీ, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్‌’. టి.నరేశ్‌ కుమార్, టి.శ్రీధర్‌ నిర్మాతలు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహనిర్మాతలు. జనవరి 1న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ – ‘‘నాకు వచ్చిన ఆలోచనను మంజుతో పంచుకున్నాను. తను పూర్తి కథ చేసి సినిమా తెరకెక్కించాడు.

సాధారణ కథల్లో మగవాళ్లు ఎదుగుతుంటారు. ఆడవాళ్లు ఇంట్లో ఉంటారు. కానీ ఇందులో రివర్స్‌లో జరుగుతుంది. హీరోయిన్‌ బాగా ఎదుగుతుంది. తన సక్సెస్‌ను చూసి హీరో తట్టుకుంటాడా లేదా అనేది కథాంశం. విలన్స్‌ ఉండరు. సింపుల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది. నైనా ఈ పాత్ర చేయడానికే పుట్టింది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వర్మగారు నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం బాగా కష్టపడ్డాను. నా పరిచయ గీతాన్ని వర్మగారే షూట్‌ చేశారు. 3 రోజుల్లో 11 కాస్ట్యూమ్స్‌తో షూట్‌ చేశాం’’ అన్నారు నైనా. ‘‘ఇదో ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ. అందరూ కనెక్ట్‌ అవుతారు. ఈ సినిమా గురించి మాట్లాడినా, చూసినా వర్మగారు కన్నీళ్లు పెట్టుకునేవారు. అంత ఎమోషనల్‌గా ఈ  సినిమాకు కనెక్ట్‌ అయ్యారు’’ అన్నారు సూరి.

మరిన్ని వార్తలు