‘అబద్దాలు చెప్తే అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు’

10 Oct, 2018 11:21 IST|Sakshi

ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత ఎనర్జిటిక్‌ యంగ్ హీరో రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 18న రిలీజ్ చేస్తున్నారు.

ప్రమోషన్‌ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్న చిత్రయూనిట్ ఆడియోను కూడా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేశారు. తాజాగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. రామ్ ఎనర్జీ, అనుపమా, ప్రణీతల క్యూట్‌ పర్ఫామెన్స్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమాలో ప్రకాష్‌రాజ్‌లు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు