రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..?

13 Sep, 2016 11:04 IST|Sakshi
రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..?

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ ప్రస్తుతం ఆ ఫాంను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. ముఖ్యంగా కథల ఎంపికతో పాటు మేకింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తనకు కందిరీగ లాంటి సూపర్ హిట్ అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమా చేస్తున్నాడు, ఈ ఎనర్జిటిక్ స్టార్.

ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరువాత పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించాడు రామ్. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి లవ్ స్టోరి స్పెషలిస్ట్ కరుణాకరన్తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంటే సినిమా చేసిన రామ్ ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయాడు. అయినా మరోసారి కరుణాకరన్ దర్శకత్వంలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట.