ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

30 Oct, 2019 11:54 IST|Sakshi

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఎనర్జటిక్‌ హీరో రామ్‌ పోతినేని బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదలై వందరోజులు పూర్తయినప్పటికీ మరో సినిమాను ఆనౌన్స్‌ చేయలేదు. అయితే దీపావళి కానుకగా తన కొత్త సినిమాను ప్రకటించాడు రామ్. తనకు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి హిట్‌ చిత్రాలను అందించినటువంటి కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రెండ్రోజుల క్రితం ఈ సినిమాకు ‘రెడ్‌’అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశాడు. తాజాగా ఆ చిత్ర షూటింగ్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. 

ఈ కార్యక్రమంలో క్రేజీ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, బ్యూటిఫుల్‌ ప్రొడ్యూసర్‌ చార్మి, తదితరులు హాజరయ్యారు. పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హీరో రామ్‌పై పూరి తొలి క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించాడు. కాగా, ఇది రామ్‌కు 18వ చిత్రం. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఇక రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. రామ్‌ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫైనల్‌ చేయలేదని చిత్ర యూనిట్‌ పేర్కొంది. అంతేకాకుండా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
 
ఇక ఇప్పటివకే విడుదలైన ఫస్ట్‌ లుక్‌లో రామ్‌ రఫ్‌గా కనిపించాడు. అంతేకాకుండా రామ్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ‘రెడ్’ సినిమా తమిళంలో సూపర్‌ హిట్‌ అందుకున్న ‘తడమ్‌’కు రిమేక్‌ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ మొదటిసారి ద్విపాత్రాభియం చేస్తున్నట్టు సమాచారం. మరి ‘రెడ్’ చిత్రంతో రామ్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే, కిశోర్ తిరుమల ఈ ఏడాది ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు రామ్‌తో ముచ్చటగా మూడోసారి పనిచేస్తున్నారు. మరి హ్యాట్రిక్‌ సాధిస్తారో లేదో చూడాలి.

రీఎంట్రీ ఇవ్వనున్న శృతిహాసన్‌
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘కాటమ రాయుడు’ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు శృతి హాసన్‌. ఆ సినిమా వచ్చి రెండేళ్లు కావస్తున్నా మరే తెలుగు సినిమాకు సైన్‌ చేయలేదు. తాజాగా రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది ఈ కోలీవుడ్‌ బ్యూటీ. డాన్‌ శీను, బలుపు వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్లనందించిన గోపిచంద్‌ మలినేని దర్వకత్వంలో రవితేజ ఓ సినిమా తీయబోతున్నారు. ఇది రవితేజకు 66వ చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించిన రీసెంట్‌ అప్‌డేట్‌ ప్రకారం ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా శృతిహాసన్‌ సైతం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’షూటింగ్‌ శరవేగంగా జరపుకుంటోంది. వీఐ ఆనంద్‌ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

రెండోసారి తండ్రి అయిన స్టార్‌ హీరో

'వివాహిత నటుడితో సహజీవనం చేశా'

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది

100 కోట్ల క్లబ్‌లో బిగిల్‌

నాగబాబు బర్త్‌డే; మెగా ఫ్యామిలీలో సందడి

‘ఆ సినిమా కథ కాపీరైట్స్‌ నావే’ 

పాత్రలా మారిపోవాలని

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ

కామెడీ గ్యాంగ్‌స్టర్‌

వారోత్సవం!

బన్నీకి విలన్‌

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది